Homeతెలుగు వెర్షన్రాజకీయ బాంబ్ పేల్చబోతున్న వైఎస్సార్ ఆత్మ

రాజకీయ బాంబ్ పేల్చబోతున్న వైఎస్సార్ ఆత్మ

The soul of YSR is about to detonate a political bomb

కేవీపీ రామ‌చంద్ర‌రావు.. రాజకీయ ఎత్తులకు బలమైన బుర్ర ఉన్న నేత. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఆత్మ‌గా పేరు గడించారు. నిజానికి ఆయన ఆత్మ కాదు, వైఎస్సార్ బుద్ధి. కేవీపీ రామ‌చంద్ర‌రావుకి రాజకీయం బాగా తెలుసు. ప్రజల నాడి ఇంకా బాగా తెలుసు. అందుకే, ఆయన మేధస్సు వైఎస్సార్ విజయానికి పునాది అయ్యింది. అయితే, వైఎస్సార్ చనిపోయాక, కేవీపీ రామ‌చంద్ర‌రావు ప్రభ ఆవిరైపోయింది. అసలు ఇన్నాళ్లు కేవీపీ రామ‌చంద్ర‌రావు ఎక్కడ ఉన్నారు ? అనే పరిస్థితి కూడా వినిపించింది. అలాంటి ఆయన తాజాగా మళ్లీ బయటకు వచ్చారు. నిజానికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేతగా కేవీపీ రామ‌చంద్ర‌రావుకి నేటికీ గుర్తింపు ఉంది.

కానీ, ఈడు పోయిన కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానానికి విలువే లేకుండా పోయింది. అయితే, తాజాగా కేవీపీ రామ‌చంద్ర‌రావు రాజ‌కీయ బాంబు పేల్చారు. వైఎస్సార్‌కు ఆత్మ‌గా పేరుగాంచిన కేవీపీ, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం వైఎస్ జ‌గ‌న్ వెంట ఎందుకు నడవలేదు ? అనే ప్ర‌శ్న‌కు ఇంత వ‌ర‌కూ కేవీపీ స‌మాధానం చెప్ప‌లేదు. కానీ ఆ ప్ర‌శ్న‌కు త్వ‌ర‌లో త‌ప్ప‌క స‌మాధానం చెబుతాన‌ని వైఎస్సార్ ఆత్మ ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాను జగన్ రెడ్డి వెంట న‌డ‌వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే.. కానీ అసలు కారణం తెలిస్తే.. అంతకు మించి మీరందరూ ఆశ్చర్యపోతారు అంటూ ఆ మధ్య కేవీపీ రామ‌చంద్ర‌రావు తన రాజకీయ సన్నిహితుల దగ్గర అన్నట్టు వార్తలు వచ్చాయి.

కానీ, ఎవరు ఎన్ని రకాలుగా అడిగినా జగన్ రెడ్డికి దూరంగా ఉండటానికి అసలు కారణం మాత్రం కేవీపీ ఎన్నడూ చెప్పలేదు. మరి ఎందుకు సడెన్ గా ఉన్నట్టు ఉండి.. జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌కపోవడానికి త్వ‌ర‌లో త‌ప్ప‌క స‌మాధానం చెబుతాన‌ని ప్ర‌క‌టించారు ?. చూడబోతే.. కేవీపీ జగన్ రెడ్డి గుట్టు రట్టు చేసేలా ఉన్నారు. జగన్ రెడ్డి చిన్న తనం నుంచే కేవీపీకి తెలుసు. పైగా ఓ దశలో జగన్ రెడ్డికి ఆర్ధికంగా సాయం అందించిన చరిత్ర కూడా కేవీపీకి ఉంది. అలాగే వైఎస్సార్ జగన్ రెడ్డి పై కోపంగా ఉన్న సమయంలోనూ.. వైఎస్సార్ కి – జగన్ రెడ్డి కి మధ్య వారధిలా వ్యవహరించిన వ్యక్తి కూడా కేవీపీనే.

అన్నింటికీ మించి కేవీపీ రామ‌చంద్ర‌రావుకి వై.ఎస్.వివేకానందరెడ్డి కూడా మంచి సన్నిహితుడు. మరి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో జగన్ రెడ్డి ఆడుతున్న నాటకాలను చాలా కాలంగా కేవీపీ రామ‌చంద్ర‌రావు గమనిస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం వై.ఎస్.వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు ? అనేది కేవీపీ రామ‌చంద్ర‌రావుకి ఐడియా ఉందని తెలుస్తోంది. మరి ఈ విషయం పై కేవీపీ రామ‌చంద్ర‌రావు ఓపెన్ గా మాట్లాడితే.. నిజంగానే ఏపీలో రాజకీయ బాంబ్ పేలుతుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!