Homeతెలుగు వెర్షన్జగన్ స్వభావం అదే.. ఇకనైనా మీరు మారండయ్యా !

జగన్ స్వభావం అదే.. ఇకనైనా మీరు మారండయ్యా !

Jagans nature is the same.
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలి అని జనంలో ఆలోచన మొదలయ్యే సమయం ఇదే. ఇలాంటి కీలక సమయంలో రాజ‌కీయాల్లో భౌతిక దాడుల‌ను ఎవ‌రూ హ‌ర్షించ‌రు. అయినా జగన్ రెడ్డి మాత్రం టీడీపీ నాయకుడు ప‌ట్టాభిని కుళ్లపొడిపించాడు. ఈ భౌతిక దాడి కారణంగా జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందొచ్చు. కానీ,  ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవడం మాత్రం ఖాయం. రాజ‌కీయాలు అనేవి సిద్ధాంతాల ప‌రంగా సాగాలి. అంతేగాని, తన పై,  తన పార్టీ పై విమర్శలు చేశాడని దాడుల విధానాలను ప్రవేశ పెడితే.. పౌర స‌మాజం చూస్తూ ఊరుకోదు జగన్ రెడ్డి.  నేడు నీ పై ఎవ్వరూ నోరు ఎత్తకపోవచ్చు. కానీ, ఓటు రూపంలో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. మహామహులే రెండో సారి ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఎందుకు జగన్ రెడ్డి అతి వినాశనం వైపు వెళ్తున్నాడు ?.          
 
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికీ  ఉన్న‌త ఆద‌ర్శాలు ఉండాలి. స‌మాజం పై,  ప్రజల పై గౌరవం చూపించాలి. కనీసం జగన్ రెడ్డి ప్రవర్తన ఇలా లేకపోయినా పర్వాలేదు.  దాడుల‌ను స్వాగ‌తించేంత‌గా దిగ‌జార‌పోయేలా జగన్ రెడ్డి పాలన తీరు సాగితే మాత్రం.. అది ఆయనకే నష్టం.  ప‌ట్టాభి పొద్దున లేచిన‌ప్ప‌టి నుంచి జగన్ పై నోరు పారేసుకునే వాడు. కాబట్టి వాడికి ఆ మాత్రం మ‌ర్యాద స‌బ‌బే” అని వైసీపీ నేత‌లు సంబరాలు చేసుకోవచ్చు. ఆఫ్ ది రికార్డుగా ప‌ట్టాభిపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించొచ్చు.  ప‌ట్టాభిపై ప్రజల్లో కూడా వ్య‌తిరేక‌త ఉందని కూలీ మీడియా కూడా కథనాలు రాయొచ్చు. కానీ.. బాధితులను నిందితులుగా చూపిస్తే.. న్యాయ దేవత చూస్తూ ఊరుకోదు.
 
న్యాయ దేవతకు కళ్లు లేకపోవచ్చు. కానీ మనసు ఉంది. ఆ మనసు ప్రతి చర్యను గమనిస్తూనే ఉంటుంది. సరైన సమయంలో నిందితులైన వైసీపీ వారందరికీ బుద్ది చెబుతుంది. ఐతే, ఇక్కడ ప‌ట్టాభి లాంటి నాయకులు కూడా ఆలోచించుకోవాలి. తన సొంత ఎంపీనే అర్ధరాత్రి అరెస్ట్ చేయించి.. చితకబాధించిన జగన్ రెడ్డి స్వభావం గురించి అర్ధం చేసుకోవాలి.  అయినా, ప‌ట్టాభి లాంటి నాయకుల్లారా.. మీరు ప్రజల్లో పోరాటం నింపాలి కానీ, మైకుల ముందు అరవడాలు, పబ్లిసిటీ కోసం అతి చేయడాలు తగ్గించండి. ఉదాహరణకు ప‌ట్టాభి విషయానికే వద్దాం. గ‌న్న‌వ‌రంలో ప‌ట్టాభి అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చారు. అక్కడకి వెళ్లాల్సిన అవసరం ప‌ట్టాభికి లేదు. మరెందుకు వెళ్లినట్టు ?. 
 
 
అదేంటి ? తన పార్టీ కార్యాల‌యంపై దాడికి కార‌ణ‌మైన వారిని  మా ప‌ట్టాభి ఎలా వదిలిపెడతాడు ?. ఇది ప‌ట్టాభి సన్నిహితుల నుంచి వచ్చిన సమాధానం. ప‌ట్టాభి ఏమైనా సినిమా హీరోనా ?, వెళ్లి ఫైట్ చేసి..  కార్యాల‌యం తగలబెట్టిన వారికీ గుణపాఠం చెప్పడానికి. అసలు ప‌ట్టాభి పని ప‌ట్టాభి చేసి ఉంటే.. ప‌ట్టాభి ఇప్పుడు చాలా బాగుండే వాడు. చెప్పింది చేయకుండా  ఓవర్ పబ్లిసిటీకి ఆశ పడితే.. వ్యవహారం ప‌ట్టాభి దుస్థితి లాగే ఉంటుంది. కాబట్టి.. టీడీపీ నాయకుల్లారా మీరు ఓవర్ చేయకండి. ప్రజల తరపున మాత్రం పోరాటం చేయండి. ప్రజల పక్షాన నిలబడింది. ప్రజల సానుభూతి పొందండి. అంతేగాని జగన్ రెడ్డి లాఠీ దెబ్బలు కాదు. ఇకనైనా మీరు మారండి.      

Recent Articles English

Gallery

Recent Articles Telugu