రవితేజతో ‘టాక్సీవాలా’ హీరోయిన్!

మాస్‌ రాజా రవితేజ తన నెక్స్ట్ సినిమాలో డిస్కో రాజాగా కనిపించనున్నారు. దర్శకుడు వీ.ఐ ఆనంద్, రవితేజ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమాకి రామ్‌ తాళ్లూరి నిర్మాతగా . ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ చిత్రంలో ఆల్రెడీ నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపిక అయ్యారు. కాగా ఇప్పుడు మూడో హీరోయిన్ ను కూడ సెలెక్ట్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. ఆమె మరెవరో కాదు ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంలో మెరిసిన ప్రియాంక జవాల్కర్. ఈ సినిమా రెగ్యులర్‌ షుటింగ్‌ ఈ నెల 13న స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో రవితేజ తండ్రీకొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త.