HomeTelugu NewsPayal Rajput: బ్యాన్‌ చేస్తామంటూ బెదిరింపులు?

Payal Rajput: బ్యాన్‌ చేస్తామంటూ బెదిరింపులు?

Payal Rajput
Payal Rajput: మూవీ ఇండస్ట్రీలో అనేక రకల వేధింపులు ఉంటాయి. అయితే కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కి కూడా అటువంటి చేదు అనుభవమే ఎదురైంది. టాలీవుడ్‌లో ఆరెక్స్ 100తో టాలీవుడ్ కు పరిచయమై ఈ బ్యూటీకి ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు పడలేదు.

గత ఏడాది ‘మంగళవారం’ సినిమా విడుదల కాగా.. ఇది పర్వలేదు అని పించింది. తాజాగా ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌ నుంచి తనను బ్యాన్‌ చేస్తామని ఓ మూవీ మేకర్స్‌ బెదిరిస్తున్నట్లు వెల్లడించారు. ‘2020లో ‘రక్షణ’ (5Ws) అనే చిత్రంలో నటించాను. ఈ సినిమా విడుదల ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది.

ఈ చిత్రబృందం ఇప్పటివరకు నాకు పారితోషికం ఇవ్వలేదు. ఇటీవల కాలంలో నా సినిమాలు విజయం సాధించడంతో ఆ సక్సెస్‌ను ఉపయోగించుకోవాలని మూవీ టీమ్‌ భావిస్తోంది. ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. నేను రాలేనని నా టీమ్‌ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. రెమ్యునరేషన్‌ చెల్లిస్తే డిజిటల్‌ ప్రమోషన్స్‌ చేస్తానని చెప్పినప్పటికీ ఫలితం లేదు.

నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇటీవల జరిగిన కొన్ని మీటింగ్స్‌లో వాళ్లు నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్ధమైంది’ అని పాయల్‌ రాజ్‌పుత్ తెలిపారు.

ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రదీప్‌ ఠాకూర్‌ దర్శకత్వంలో పాయల్‌ ప్రధానపాత్రలో ‘రక్షణ’ తెరకెక్కింది. ఈ సినిమా జూన్‌7న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!