HomeTelugu Trendingధనుష్‌ 'తూటా' ట్రైలర్‌ రీలీజ్‌

ధనుష్‌ ‘తూటా’ ట్రైలర్‌ రీలీజ్‌

7a 3తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘తూటా’. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వం వహించారు. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. విజయభేరివారి సంస్థ నిర్మిస్తోంది. దర్బుక శివ బాణీలు అందిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం అక్కినేని నాగార్జున విడుదల చేశారు. తనకు ఇష్టమైన దర్శకుడు గౌతమ్‌ సినిమా ట్రైలర్‌ చూడమని ట్వీట్‌ చేశారు.

‘నా కథకు మొదలు లేఖ.. ఒక లవ్‌స్టోరీ, నా లవ్‌స్టోరీ..’ అంటున్న ధనుష్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ఆయన్ను చంపుతామని కొందరు బెదిరిస్తూ కనిపించారు. అంత వరకు బాధలు భరించిన ధనుష్‌ చివరికి తెగించి… ‘చాలు.. ఇక మీద నా దారికి ఎవరు అడ్డుపడ్డా చచ్చాడే..’ అంటూ అందరిపై విరుచుకుపడ్డారు. ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందించినట్లు అర్థమౌతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu