HomeTelugu Trendingవివాదంలో చిక్కుకున్న నాగశౌర్య..!

వివాదంలో చిక్కుకున్న నాగశౌర్య..!

8 6

యంగ్‌ హీరో నాగశౌర్య, మెహ్రీన్‌ హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఉష ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదలై థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. రమణతేజ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఇప్పుడు శౌర్యను చిక్కుల్లో పడేసింది. అదేంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్రైవర్ల పట్ల నాగశౌర్య అవమానకరంగా మాట్లాడారని శౌర్యపై తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. చదువుకోని కొంత మంది వ్యక్తులు డ్రైవర్ వృత్తిని ఎన్నుకుంటారని మద్యానికి బానిసై నేరాలు పాల్పడుతారని వ్యాఖ్యలు చేసినట్లు ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నాగ శౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu