HomeTelugu Trending'టైగర్ నాగేశ్వరరావు' లాంచ్‌- ప్రీ లుక్ ముహుర్తం ఫిక్స్‌

‘టైగర్ నాగేశ్వరరావు’ లాంచ్‌- ప్రీ లుక్ ముహుర్తం ఫిక్స్‌

Tiger nageswara rao muhurth
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్, లాంచ్ ఎప్పుడు ? వంటి విషయాలను కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

టైగర్ నాగేశ్వరరావుని ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఈ రోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అదే రోజున 12 గంటలకు సినిమా ప్రీ-లుక్ ను కూడా రివీల్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్ తన హోమ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ పాన్-ఇండియన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

కన్యాకుమారిలో హీరో సూర్య-డైరెక్టర్‌ బాల

Recent Articles English

Gallery

Recent Articles Telugu