HomeTelugu Big Stories16 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య

16 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య

10 21
టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్యకు పాల్పడింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. టిక్‌టాక్‌లో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. కుర్రాళ్లంతా టిక్‌టాక్‌లో సియా కక్కర్ జపం చేస్తుంటారు. టిక్‌టాక్‌లో సుమారు 11 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు కూడా పాపులర్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 91 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన సమస్యలు ఏమిటో అంతు చిక్కడం లేదు. సియా సూసైడ్ గురించి ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.

చివరిగా సియా తన మేనేజర్ అర్జున్ సరిన్‌తో మాట్లాడింది. తనతో మాట్లాడిన సమయంలో సియా ఎలాంటి బాధలో లేదని అలాంటి ఉద్దేశ్యం కూడా ఉన్నట్లు అనిపించలేదని మేనేజర్ తెలిపాడు. సియా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. సియా ఆత్మహత్య మిస్టరీగా మారింది. తన చివరి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సియా కక్కర్ పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈమె ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం రేపుతుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య నుంచి తేరుకోకముందే మరో తార నేలరాలింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu