కమెడియన్ అని ధైర్యం చేస్తే.. ముంచేశాడుగా!

సినిమా విడుదలయ్యే వరకు దాని పరిస్థితి ఏంటో.. ఎవరు చెప్పలేరు. ఏ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందో.. ఏ సినిమా నిర్మాతలను ముంచేస్తుందో.. ముందుగా ఎవరు అంచనా వేయలేరు. ఒకరకంగా సినిమా అనేది జూదం లాంటిదని చెప్పొచ్చు. ఓవర్ నైట్ లో కోటీశ్వరులను చేస్తుంది.. అదే రాత్రిలో రోడ్డున కూడా పడేస్తుంది.

రీసెంట్ గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా మారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు పబ్లిసిటీ పరంగా ఇండస్ట్రీకు చెందిన ఎందరో ప్రముఖులు సహాయం చేశారు. సినిమా రిలీజ్ అయిన తరువాత పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

కానీ అవేవీ సినిమాను కాపాడలేకపోయాయి. సినిమాను నమ్మి దాదాపు 7 కోట్ల రూపాయలు పెట్టి కొన్న బయ్యర్లు నష్టపోయారు. కనీసం నాలుగు కోట్ల నష్టాల్ని ఈ సినిమా మిగిల్చిందని చెబుతున్నారు.

నిర్మాత ముందే సినిమాను అమ్మేసి లాభ పడినప్పటికీ బయ్యర్లు మాత్రం బాగా నష్టపోయారు. ఇక మీదట కమెడియన్ సినిమాలు కొనడానికి బయ్యర్లు ముందుకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.