HomeTelugu Trendingడీజే టిల్లు నుండి డీజే పాట విడుదల

డీజే టిల్లు నుండి డీజే పాట విడుదల

Tillu Anna DJ Pedithe Lyric
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్‌ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. హీరో గుణగణాలను వివరిస్తూ సాగుతుందీ ఈ పాట. టిల్లు అంటే ఏంటో ఈ పాట ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు రచయిత కాసర్ల శ్యామ్‌. రామ్‌ మిర్యాల గానం అందరినీ అలరించేలా ఉంది. శ్రీచరణ్‌ పాకాలతో కలిసి రామ్‌ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో సిద్ధు సరసన నేహాశెట్టి సందడి చేయనుంది. ఈవినోదాత్మక చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!