ఎన్టీఆర్ తో ఆ ముగ్గురు!

ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి మూడు పాత్రల సరసన హీరోయిన్స్ గా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది.

ఈ నేపధ్యంలో హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. ముందుగా కాజల్ పేరు బాగా వినిపించింది. ఎన్టీఆర్, కాజల్ లు కలిసి గతంలో బృందావనం, టెంపర్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. దీంతో ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఇద్దరి హీరోయిన్స్ కోసం నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లను తీసుకున్నట్లుగా సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరో సరసన అవకాశం రావడం అధృష్టమనే చెప్పాలి!