HomeTelugu Big Storiesకృష్ణ వ్రింద విహారి: టైటిల్‌ సాంగ్‌ విడుదల

కృష్ణ వ్రింద విహారి: టైటిల్‌ సాంగ్‌ విడుదల

Title Song from Krishna Vri
టాలీవుడ్‌ యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాతో షిర్లీ సెటియా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మల్పూరి నిర్మించారు. సెప్టెంబర్ 23న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ క్రమంలో.. తాజాగా మేకర్స్ ‘కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘గుడు గుడు గుంజం గోవిందా.. టార్చర్ ఇట్లా ఉంటుందా…’ అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ పాటకు ట్యూన్ ని సమకూర్చారు. గాయకుడు రామ్ మిరియాల ఆలపించాడు. ఈ సినిమా రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించగా.. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu