‘కృష్ణ వ్రింద విహారి’ ట్రైలర్‌ విడుదల


టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమాని నాగశౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో షిర్లే సెటియా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ.. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. వెన్నెల కిశోర్ .. సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నటి రాధిక కీలకమైన పాత్ర పోషించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates