HomeTelugu Trendingచిన్నారి అభిమానికి అల్లు అర్జున్‌ సర్‌ప్రైజ్‌

చిన్నారి అభిమానికి అల్లు అర్జున్‌ సర్‌ప్రైజ్‌

Tollywood Hero Allu Arjun f

టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ చిన్నారి అభిమానికి సర్‌ప్రైజే ఇచ్చాడు. ఎప్పటికైనా బన్ని ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలన్నది ఓ బాలుడి కోరిక. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ తాను సంతకం చేసిన ఓ కాగితాన్ని తన కుమారుడు అయాన్‌కు ఇచ్చి అనాథాశ్రమానికి పంపారు. క్రిస్మస్‌ సందర్భంగా అయాన్‌ ఆ బాలుడికి బన్ని ఆటోగ్రాఫ్‌ అందజేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అంతేకాదు, అనాథాశ్రమంలో ఉన్న మిగిలిన చిన్నారులకు కూడా పలు గిఫ్ట్‌లు ఇచ్చి, ఆనందపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బన్ని సంతకం తీసుకున్న ఆ బాలుడు ఆనందంతో పరవశించిపోయాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu