HomeTelugu Trendingఘనంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం.. ఫొటో వైరల్‌

ఘనంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం.. ఫొటో వైరల్‌

tollywood Hero karthikeya e

టాలీవుడ్‌ హీరో కార్తికేయ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం కార్తికేయ నిశ్చితార్థానికి హాజరైయ్యారు. కాగా కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినీరంగంపై ఆసక్తితో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2017లో విడుదలైన ‘ప్రేమతో మీ కార్తీక్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. అనంతరం వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఆయనకు సూపర్‌హిట్‌ అందించింది. కేవలం కార్తికేయ హీరో పాత్రలు మాత్రమే కాకుండా విలన్‌గా కూడా మెప్పిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu