HomeTelugu Trendingరిపీట్‌ కానున్న 'ఆర్ ఎక్స్ 100' కాంబినేషన్‌!

రిపీట్‌ కానున్న ‘ఆర్ ఎక్స్ 100’ కాంబినేషన్‌!

Ajay Bhupathi with Karthike

అజయ్ భూపతి డైరెక్షన్‌లో కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’. ఈ సినిమా యూత్‌ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాతో హీరోగా కార్తికేయకు మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. అయితే ఆ తరువాత అజయ్ భూపతి చేసిన ‘మహా సముద్రం’ సక్సెస్ కాలేదు.

ఇక ఈ మధ్య కార్తికేయ చేసిన ‘చావుకబురు చల్లగా’ .. ‘రాజా విక్రమార్క’ సినిమాలు రెండూ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలనే ఆలోచన చేశారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను అజయ్ భూపతి రెడీ చేస్తున్నాడని అంటున్నారు.

Ajay Bhupathi 1

మరోపక్క తమిళంలో ‘వలిమై’ సినిమాలో అజిత్ ను ఎదుర్కునే విలన్ పాత్రలో కార్తికేయ నటించాడు. సంక్రాంతికి ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ఆ సినిమాతో కార్తికేయకి అక్కడ మంచి గుర్తింపు వస్తుంది కనుక, తెలుగుతో పాటు తమ సినిమాను తమిళంలోను విడుదల చేయాలనే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను జెమినీ ఫిల్మ్ సర్క్యూట్
వారు నిర్మిస్తున్నట్టుగా వినికిడి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu