HomeTelugu Trendingశ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం

శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం

11 4
టాలీవుడ్‌ హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ ఆర్ట్స్‌ ఎల్‌ఎల్‌పీలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో హాసిత్‌ గోలి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. శ్రీ విష్ణుతో మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా వంటి సెన్సిబుల్‌ సినిమాలు తీసిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దగ్గర ఇతను దర్శకత్వ శాఖలో పనిచేశాడు.

వైవిధ్యభరితమైన కథతో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు హాసిత్‌ తెలిపారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో అలరించిన శ్రీవిష్ణు ఇటీవల ఇటీవల ‘తిప్పరా మీసం’ సినిమాతో ప్రేక్షకులను డిసపాయింట్‌ చేశాడు. రొటీన్‌ కమర్షియల్ ఫార్ములాతో ఈ సినిమాను తెరకెక్కించడం శ్రీవిష్ణు ఫ్యాన్స్‌ను నిరాశపరించింది. ఈ నేపథ్యంలో తన అభిమానులు తన నుంచి ఆశించే విభిన్నమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్న ఈ మూవీ సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu