HomeTelugu TrendingTripti Dimri: యానిమల్‌ బ్యూటీకి టాలీవుడ్‌లో వరుస ఆఫర్‌లు!

Tripti Dimri: యానిమల్‌ బ్యూటీకి టాలీవుడ్‌లో వరుస ఆఫర్‌లు!

Tollywood offers for Tripti
Tripti Dimri: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప-2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో.. పుష్ప-2ను భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదల కానున్న ఈ సినిమాలో స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. మెయిన్ గా బాలీవుడ్ యాక్టర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి డిమ్రీని పుష్ప మేకర్స్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

యానిమల్ చిత్రంతో త్రిప్తికి మంచి గుర్తుంపు వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పుష్ప-2లో కీలక పాత్ర పోషిస్తోందట. పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేసే పాత్రలో త్రిప్తి డిమ్రీ నటించనుందట. ఇప్పటికే త్రిప్తిని మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాత్ర చిన్నదే అయినా.. ఆమె రోల్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందట. బన్నీ, త్రిప్తి కాంబోలో వచ్చిన సీన్లు… సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయట.

త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ఆల్రెడీ రవితేజ – అనిల్ రావిపూడి సినిమా కోసం, విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఆమె ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu