HomeTelugu Trendingప్రముఖ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత

ప్రముఖ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత

Senior Editor goutham raju

సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్‌, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్‌ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. గౌతమ్‌రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

15 జనవరి 1954లో మద్రాసులో గౌతంరాజు జన్మించారు. 1982లో ‘దేఖ్ఖబర్ రఖ్ నజర్’ అనే సినిమాతో ఎడిటింగ్ కెరియర్‌ను ప్రారంభించారు. ఇండస్ట్రీలో అత్యుత్తమ ఎడిటర్‌గా పేరు సంపాదించుకున్నారు. ‘ఆది’ సినిమా ఎడిటింగ్‌కు గాను 2002లో నంది అవార్డు అందుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu