HomeTelugu NewsTollywood: ఆ జోనర్‌లో సినిమాలు చేయనంటున్న యంగ్‌ హీరో

Tollywood: ఆ జోనర్‌లో సినిమాలు చేయనంటున్న యంగ్‌ హీరో

Tollywood

Tollywood: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం టాలీవుడ్ మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రేపు విడుదల కాబోతుంది. వరుస ప్లాఫ్‍ల్లో ఉన్న విజయ్‍ ఈ చిత్రం చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యామిలీ స్టార్ కోసం జోరుగా ప్రమోషన్లను చేస్తున్నారు. కాగా విజయ్‌ దేవరకొండ.. ఇప్పటి వరకూ యాక్షన్, లవ్ కామెడీ, సూపర్ న్యాచురల్, పొలిటికల్.. ఇలా అన్ని జోనర్స్ టచ్ చేశాడు.

Tollywood young1 Tollywood,Vijay Devarakonda,horror genre,family star,Mrunal Thakur

అయితే ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఎలాంటి జోనర్ సినిమాలు అయినా, ఏ డైరెక్టర్ తో అయినా చేయడానికి రెడీ. కానీ ఆ హారర్ సినిమాలు మాత్రం చేయను.

ఎక్కువమంది ఆడియన్స్ రీచ్ ఉండే సినిమాలే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. హారర్ సినిమాలకు అందరూ కనెక్ట్ అవ్వలేరు. నేను కూడా హారర్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయలేను అని కామెంట్స్ చేశాడు. దీంతో విజయ్ ని హారర్ సినిమాల్లో చూడలేము అని, ఆయన నుంచి హారర్ సినిమాలు రావని తెలిసిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu