బాబాయ్ కష్టపడుతున్నాడు.. ఏదో ఒకటి చేయాలి నాన్న

మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’కు తన పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన కుమారుడు వరుణ్ తేజ్ తో కలిసి పార్టీకి భారీ మొత్తంలో విరాళం కూడ ఇచ్చారు. అన్నీ వదులుకుని పవన్ ప్రజాసేవ కోసం జనంలోకి వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందన్న నాగబాబు తమ్ముడు అంత చేస్తుంటే అతనకి సహాయం చేయాలని ఉందని, వరుణ్ తేజ్ కూడ బాబాయ్ కష్టపడుతున్నాడు, నాకేమో షూటింగ్స్ ఉన్నాయ్, ఏదో ఒకటి చేయాలి నాన్న అన్నాడని, తమ మద్దతు జనసేనకు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు.