
Upcoming India’s Most Expensive Films:
ఇండియన్ సినిమా ఇప్పుడు అద్భుతమైన ఫేజ్‌లో ఉంది. కథలు పెద్దవి కావొచ్చు కానీ బడ్జెట్లు ఇంకా పెద్దవి అవుతున్నాయి. ఇక 2025 నుంచి 2027 వరకు మనం చూసే సినిమాలు అన్నీ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయబోతున్నాయి. అందులో టాప్ 3 సినిమాల బడ్జెట్ మాత్రం నిజంగా నమ్మలేనంత పెద్దగా ఉంది!
1. SSMB 29 – రూ. 1000 కోట్లు+
మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి కాంబో అంటేనే ఊహించగలిగే అంచనాలు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు రూ. 1000 కోట్లకిపైగా బడ్జెట్ పెట్టారంటే అది ఊహకు కూడా మించి. అడవిలో జాగ్రఫికల్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోంది. ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది 2027లో విడుదల కానుంది.
2. రామాయణం – రూ. 900 కోట్లు+
దంగల్ ఫేమ్ నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ రెండు పార్టులుగా వస్తుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యాష్ రావణుడిగా నటిస్తున్నారు. మొదటి పార్ట్ 2026 దీపావళి, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. టోటల్ బడ్జెట్ రూ.900 కోట్లకు పైగా ఉంది.
3. AA22 X A6 – రూ. 800 కోట్లు+
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ యాక్షన్ డ్రామా సన్ పిక్చర్స్ బ్యానర్‌లో వస్తోంది. రూ. 800 కోట్ల బడ్జెట్‌తో, ఇందులోని వీఎఫ్ఎక్స్‌కే మాత్రమే రూ. 250 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. బన్నీ రెమ్యూనరేషన్ రూ. 175 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేర్. అట్లీకి రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్.
మూడు సినిమాలు కలిపి రూ. 2700 కోట్ల బడ్జెట్ అంటే… ఇండియన్ సినిమా ఇంకో లెవెల్‌కి వెళ్తుందనడంలో సందేహం లేదు!
ALSO READ: Highest Paid Actors జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టాలీవుడ్ హీరో ఎవరంటే













