HomeTelugu Trendingయానిమల్ తర్వాత తృప్తి డిమ్రికి బంపర్ ఆఫర్

యానిమల్ తర్వాత తృప్తి డిమ్రికి బంపర్ ఆఫర్

Tripti Dimri chanceయానిమల్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి. ఈ చిత్రంలో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా నేషనల్ క్రష్ అయిపోయింది.

ఇప్పుడు తృప్తి డిమ్రి తర్వాతి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. యానిమల్ మూవీ తర్వాత తృప్తి ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. తృప్తికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‍‍లో పాపులర్ ఆషికీ ఫ్రాంచైజీలో రానున్న ఆషికీ-3 మూవీలో తృప్తి డిమ్రికి హీరోయిన్‍గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మ్యూజికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఆషికీ-3 మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమా బంపర్ హిట్ తర్వాత తృప్తి డిమ్రి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

తృప్తి డిమ్రి కార్తీక్ ఆర్యన్‍తో కలిసి నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆషికీ-3 మేకర్స్ అనుకుంటున్నారట. దీనిపై కొంతకాలంగా చర్చ జరుగుతోందట. ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.

ఆషికీ-3 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu