HomeTelugu Big StoriesVishwambhara: 18 ఏళ్ల తర్వాత మరోసారి హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మరోసారి హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

Trisha as heroine in ChiranVishwambhara: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర‌’. వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో చిరంజీవి జాయిన్‌ అయ్యాడు. ఈక్రమంలో మరో ఆసక్తికర అప్డేట్‌ వచ్చింది.

భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోమ‌వారం చిరంజీవి ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశాడు. త్రిష విశ్వంభ‌ర సెట్స్‌లో అడుగుపెట్టిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌తంలో 2016లో రిలీజైన‌ స్టాలిన్ సినిమాలో చిరంజీవికి జోడీగా న‌టించింది త్రిష‌. దాదాపు ప‌ద్దెనిమిదేళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవితో త్రిష జోడీకొట్ట‌బోతున్న‌ది. త్రిష రీఎంట్రీ తరువాత వరుస హిట్‌లతో మరోసారి ఫేమ్‌లోకి వచ్చింది.

విశ్వంభర సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!