HomeTelugu Trending14ఏళ్ల తరువాత ఆ స్టార్‌ హీరోతో త్రిష!

14ఏళ్ల తరువాత ఆ స్టార్‌ హీరోతో త్రిష!

trisha with kollywood star
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ‘బీస్ట్’ తరువాత ఆయన మరో భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్‌కి ఇది 67వ సినిమా.

అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలను వరుసగా విడుదల చేస్తున్నారు మేకర్స్‌. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో కనిపించనున్నట్టు చెబుతూ పోస్టర్లను వదిలారు.

trisha 1

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తాజాగా త్రిష పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించనుంది. 14 ఏళ్ల తరువాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే నాలుగు సార్లు విజయ్ మరియు త్రిష కలిసి నటించారు. 5వ సారి విజయ్ మరియు త్రిష లు కలిసి నటించబోతున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ‘మాస్టర్’ తరువాత మళ్లీ విజయ్ – లోకేశ్ కనగరాజ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu