‘మన్మథుడు 2’ కోసం మరింత యంగ్‌గా మారిన నాగార్జున

టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ ఛార్మింగ్ హీరో అంటే నాగార్జునే. ఆయనకు వయసు పెరిగే కొద్ది గ్లామర్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన కొన్ని స్టిల్స్ సాయంత్రమే విడుదలయ్యాయి. అందులో నాగార్జున సీనియర్ హీరోలా కాకుండా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా ఫిట్ అండ్ గ్లామరస్ అనేలా కనిపిస్తున్నారు. ఆ స్టిల్స్ చూసిన కొందరు ఆ గ్లామర్ ఏంటి… మీకు వయసు పెరగదా నాగ్ అంటుంటే ఇంకొందరు మాత్రం మన్మథుడు అనే ట్యాగ్ లైన్ ఆయనకు సరైనదే అంటున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్‌ ప్రీతీసింగ్‌ నటిస్తుంది. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో అలరించనున్నారు