HomeTelugu Trendingసెట్‌లో త్రివిక్రమ్‌- అల్లుఅర్జున్‌.. ఫొటో వైరల్‌

సెట్‌లో త్రివిక్రమ్‌- అల్లుఅర్జున్‌.. ఫొటో వైరల్‌

Trivikram Direct to Allu A
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా.. ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం ఇద్దరు కలిశారు. అల్లు అర్జున్ ఇప్పటికే పలు బ్రాండ్లకు సంతకం చేశాడు. మరికొన్ని కంపెనీలు అతన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ కమిటైన ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ యాడ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కలసి చేస్తున్న కమర్షియల్ యాడ్ కు సంబంధించిన కొన్ని సెట్స్ లోని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో బన్నీ ఫుల్ డ్రెస్ లో ఉన్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘పుష్ప 1’ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో రెండో భాగాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రానుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అయ్యాడు. #SSMB28 వచ్చే నెలలో సెట్స్ మీదకు రానుంది. ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu