‘వినయ విధేయ రామ’ టీజర్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ హీరోగా, భరత్‌ అనే నేను ఫేం కైరా అ‍ద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్ర బృందం‌. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. బోయపాటి మార్క్‌ మాస్‌ క్యారెక్టర్‌లో చరణ్‌ ఇరగదీశాడు. 49 సెకన్ల ఈ టీజర్‌ను మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో పవర్‌ ప్యాక్డ్‌గా రెడీ చేశారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.