HomeTelugu Trendingబాహుబలి మీమ్‌కి పడిపోయిన ట్రంప్‌.. మీరూ ఓ లుక్కేయండి..

బాహుబలి మీమ్‌కి పడిపోయిన ట్రంప్‌.. మీరూ ఓ లుక్కేయండి..

1 22
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే… అయితే ఆయన రాకను భారత ప్రభుత్వం చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ట్రంప్ పర్యటించబోయే గుజరాత్ రాష్టాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది. ట్రంప్ పర్యటనకు ఏ విధమైన ఆటంకం కలగకుండా అని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయన పర్యటన కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తుందంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నాడని తెలిసినప్పటినుండి ఈ విషయం పై రకరకాల మీమ్స్ వస్తున్నాయి. అయితే దానికి పై బాహుబలికి సంబంధించిన మీమ్ ఒకటి ట్రంప్ వద్దకు చేరుకోగా ఆయన దానిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఇండియాలోని నా ఫ్రెండ్స్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అందులో ప్రభాస్ స్థానం లో ఉన్నారు ఈ అమెరికా అధ్యక్షుడు. అయితే ట్రంప్ షేర్ చేసిన కొద్ది సేపట్లోనే ఈ మీమ్‌ వైరల్ గా మారింది. అయితే అందులో హీరోయిజం ట్రంప్ కి బాగా నచ్చిఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu