HomeTelugu Newsశాతకర్ణికి సుబ్బిరామిరెడ్డి సన్మానం!

శాతకర్ణికి సుబ్బిరామిరెడ్డి సన్మానం!

ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త సుబ్బిరామిరెడ్డి నిన్న సాయంత్రం శతచిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ‘దానవీరశూర కర్ణ’తో పోల్చడం విశేషం. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. “తెలుగు సినిమా చరిత్రలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ మైలురాయి లాంటిది. తెలుగువారికి తెలియని తెలుగు వీరుడ్ని క్రిష్ ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 79 రోజుల్లో ఈ అద్భుతాన్ని చిత్రీకరించడంతోపాటు.. అఖిలాంధ్ర ప్రేక్షకుల అభినందనలు అందుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. సీనియర్ ఎన్టీయార్ గారు ఎలా అయితే ‘దానవీరశూర కర్ణ’ గా అందరికీ గుర్తుండిపోయారో.. అదే తరహాలో బాలకృష్ణ ముందు తరాలకి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గా గుర్తుండిపోతాడు. ఈ చిత్రం నెక్స్ట్ జెనరేషన్స్ కి ఒక పాఠ్యాంశంలా నిలుస్తుంది” అన్నారు. 
చిత్ర దర్శకులు క్రిష్ మాట్లాడుతూ.. ”సినిమా రిలీజ్ అయినప్పట్నుంచి నా ఫోన్ కి వరుసబెట్టి అభినందనా సందేశాలు వస్తూనే ఉన్నాయి. సినిమా సక్సెస్ సాధించినదానికంటే.. ఓ తెలుగువాడి ఘన చరిత్రను తెలియజెప్పినందుకు నన్ను మెచ్చెకొంటుండడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణగారి వేలిముద్ర ఈ చిత్రం. ఆయన ఇదివరకూ నటించిన 99 సినిమా ఒకెత్తు అయితే.. ఈ 100వ చిత్రంలో ఆయన నటవిశ్వరూపం మరో ఎత్తు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం బాలకృష్ణగారికే చెందుతుంది” అన్నారు. 
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ”గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో టైటిల్ పాత్ర పోషించే అవకాశం లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా నాన్నగారి ఆశీస్సుల వల్లే ఇలాంటి అద్భుతమైన చిత్రంలో భాగస్వామినయ్యే అవకాశం లభించింది. మా నాన్నగారు ‘శాతకర్ణు’డి చరిత్రను సినిమాగా తీద్దామనుకొన్నారు, అలాంటిది నేడు ఆ సినిమాలో నేను నటించడం అనేది గర్వకారణం. నాకు ఈ అద్భుత అవకాశాన్ని కల్పించిన దర్శకుడు క్రిష్ మరియు నిర్మాతలకు నా కృతజ్నతలు. అలాగే.. ఈ విధంగా కళలను ఎంకరేజ్ చేస్తున్న సుబ్బిరామిరెడ్డిగారికి నా ధన్యవాదాలు” అన్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu