HomeTelugu Trendingటక్‌ జగదీష్‌ షూటింగ్‌ ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

టక్‌ జగదీష్‌ షూటింగ్‌ ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Tuck Jagadish

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీష్’. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో తిరిగి షూటింగ్ ప్రారంభమైన టక్‌ జగదీష్ చిత్ర యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారని, టీమ్ మొత్తం ఐసొలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారు. ”అన్ స్టాపబుల్.. #టక్ జగదీష్ సెట్స్ లో 38వ రోజు” అని ట్వీట్ చేస్తూ ఓ వీడియోను జత చేశాడు. ఈ వీడియోద్వారా చిత్రబృందం షూటింగ్ జరుపుతున్నట్లు క్లారిటీ వస్తోంది. ఇక రూమర్లకు చెక్ పడినట్టే చెప్పొచ్చు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ రొమాన్స్ చేయబోతున్నారు. సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‌శివ నిర్వాణ‌కు డైరెక్ట‌ర్ గా మొద‌టి సినిమాతోనే మంచి బ్రేక్ వ‌చ్చింది. మ‌రోసారి ఈ క్రేజీ కాంబోలో వ‌స్తున్న ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంపై అభిమానుల్లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu