HomeTelugu Trendingహీరో నానికి థమన్‌ కౌంటర్‌?

హీరో నానికి థమన్‌ కౌంటర్‌?

Thaman counter to Hero nani

మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తూ దూసుకెళ్తున్నారు. పలు పెద్ద సినిమాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. అయితే తాజాగా తమన్‌ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆయన వరుసగా చేసిన ట్వీట్లు హీరో నానిని ఉద్దేశించే అని నెటిజన్లు అంటున్నారు. థమన్ ట్విట్టర్‌లో అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పని చేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్ కూడా దేనినీ డామినేట్ చేయదని తెలుపుతూ ట్వీట్స్ చేశారు.

హీరో నాని ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తన సినిమాలోని సంగీతం అన్ని ఇతర విభాగాల్లాగే ప్రాముఖ్యత పరంగా సమానంగా ఉందని, సంగీతం లేదా బీజీఎమ్ ఏ ఇతర విభాగాలను డామినేట్ చేయలేదని అన్నాడు. నాని మాట్లాడుతూ .. ‘సంగీతం సినిమాను ఎలివేట్ చేయాలి తప్ప సినిమాను డామినేట్ చేయకూడదు. సంగీతం, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ వంటి అన్ని క్రాఫ్ట్‌లు మిళితమయ్యి బాగా పని చేయాలి. లేకుంటే సినిమాలో శృతి లోపిస్తుంది’ అని నాని అన్నారు.

నాని చేసిన ఈ ప్రకటన ‘అఖండ’లో థమన్ చేసిన పనిని డైరెక్ట్ టార్గెట్ చేసినట్టుగా ఉందని చాలామంది అనుకున్నారు. అయితే ‘అఖండ’ చిత్రంలో మాత్రం మెయిన్ హైలెట్ బీజీఎమ్ అనేది సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం. కాగా నాని ‘టక్ జగదీష్‌’ సినిమాకు థమన్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని సమస్యల కారణంగా సినిమా మధ్యలోనే థమన్ బయటకు వచ్చేశాడు. ఆయన స్థానంలో గోపీ సుందర్‌ని తీసుకున్నట్లు సమాచారం. అక్కడ మొదలైంది అసలు గొడవ అంటున్నారు. మరి తమన్ తాజా ట్వీట్ లపై నాని స్పందిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu