రేప్ కేసులో హిందీ నటుడు అరెస్ట్‌!

హిందీ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక మహిళను పెళ్లి పేరుతో బలవంతం చేసి, ఆ తతంగాన్ని వీడియో తీసి డబ్బులు ఇవ్వకుంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడట కరణ్. కరణ్ వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ పోలీసులకు పిర్యాదు చేయడంతో అతనిపై సెక్షన్ 376, 384 కింద కేసు నమోదుచేసి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కరణ్ పలు టీవీ సీరియళ్ళలో పాటు పలు రియాలిటీ షోల్లో సైతం కనిపించాడు.