HomeTelugu Trendingఅల్లరి నరేశ్‌ 'ఉగ్రం' టీజర్‌ అప్డేట్‌

అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ టీజర్‌ అప్డేట్‌

ugram teaser update

‘అల్లరి నరేశ్‌’ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఉగ్రం. ‘నాంది’ ఫేం విజయ్‌ కనకమేడల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో మలయాళ భామ మిర్ణా హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ విడుదలైంది. ఉగ్రం టీజర్‌ ను రేపు ఉదయం 11:34 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

నేను ఇంతకుముందెన్నడూ చేయని, మీరు ఇంతముందు ఎన్నడూ చూడని.. కొత్త అంశంతో మీ ముందుకొస్తున్నా అంటూ టీజర్ అప్‌డేట్ అందించాడు అల్లరి నరేశ్‌. డార్క్‌ షేడ్స్‌ ఉన్న లొకేషన్‌ నుంచి అల్లరి నరేశ్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై వస్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.ఈ సినిమాకి టూమ్‌ వెంకట్‌, అబ్బూరి రవి కథ, సంభాషణలు అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మే 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్‌ ఇటేవలే ‘నాంది’ సినిమాతో తన రూట్‌ మార్చి ఛాలెంజింగ్ రోల్స్‌ చేయడం ప్రారంభించాడు. ఈ ఏడాది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరి నరేశ్‌. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu