డిఫరెంట్‌లుక్‌తో వరుణ్‌ ‘వాల్మీకి’

విభిన్న కథలతో కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘వాల్మీకి’. గురువారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమాలోని తన లుక్‌ను పంచుకుంటూ ‘సరికొత్త బాటలో వాల్మీకి’ అని ట్వీట్‌ చేశారు. గుబురు గడ్డం, చెవి పోగుతో ఉన్న ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది. మరో పక్క హరీశ్‌ శంకర్‌ కూడా సినిమా గురించి ట్వీట్‌ చేస్తూ, ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్‌ అయాంక్‌ బోస్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉండగా, ఇప్పుడు ఈ లుక్‌లో వరుణ్‌ కాస్త భిన్నంగా కనిపించి, సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates