HomeTelugu Trendingనరేష్‌ 'ఉగ్రం' టీజర్‌

నరేష్‌ ‘ఉగ్రం’ టీజర్‌

Ugram Movie Teaser 1

అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉగ్రం’. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే నరేష్ మరో ప్రయోగం చేయబోతున్నట్లు అర్ధమైంది. తాజాగా కొద్ది సేపటి క్రితమే టీజర్ రిలీజ్ అయింది. ఇందులో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.

ఆద్యంతం శత్రువులపై పోలీస్ పవరేంటో చూపించాడు. గత సినిమాల్లో నరేష్ ఫైట్లు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఈ సినిమాలో ఉగ్రరూపం చూపించాడు. ప్రత్యర్ధులపై బుల్లెట్ల వర్షం.. పవర్ ఫుల్ డైలాగులు..అందులో బీఫ్ సౌండింగ్ వేయాల్సిన డైలుగులు కూడా నరేష్ నోట పలికాడు.

కొన్ని డైలాగులు నరేష్ పాత్ర తీరును హైలైట్ చేస్తున్నాయి. ఈ టీజర్ మొత్తం నరేష్ పాత్రని హైలైట్ చేస్తుంది. స్టైలిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తున్నాడు.

సాహు గారపాటి హరీష్ పెద్ది కలిసి ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తరువాత నరేష్‌ నటిస్తున్న చిత్రం ఇది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu