HomeTelugu Big Storiesఅన్‌స్టాప‌బు‌ల్-2: పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది

అన్‌స్టాప‌బు‌ల్-2: పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది

nbk

టాలీవుడ్‌ సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేసిన ప్రొగ్రామ్‌ ‘అన్ స్టాపబుల్’. ఈ తెలుగు టాక్ షో అతి పెద్ద విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. హీరోగా మంచి ఫాలోయింగ్‌ ఉన్న బాల‌య్య ఈ షోలో త‌న కామెడీ టైమింగ్ తో వీక్ష‌కుల‌ను మైమ‌ర‌పించారు. త‌న మార్కు అల్ల‌రితో పాటు, పంచ్ డైలాగ్స్ తో షోను స‌క్సెస్ చేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాప‌బుల్ లో ప‌లువురు సెల‌బ్రిటీల‌ను అతిథులుగా పిలిచి బాల‌య్య చేసిన సంద‌డి చేశారు.

ఈ క్రమంలో అన్‌స్టాప‌బు‌ల్ సీజ‌న్-2 అతి త్వ‌ర‌లో ప్రారంభం కానున్నట్లు ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. అయితే, కొత్త సీజ‌న్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా పేర్కొనలేదు. పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది… అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అయితే ద‌సరా లేదా దీపావ‌ళికి కొత్త సీజ‌న్ ప్రారంభం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా అంటూ బాల‌య్య మార్కు డైలాగ్ మాదిరి హ్యాష్‌ట్యాగ్ ను జ‌త చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu