రివ్యూ: దువ్వాడ జగన్నాథం

నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, మురళీశర్మ, రావు రమేష్, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనాంక బోస్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: హరీష్ శంకర్
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమా మొదటినుండి కూడా ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
దువ్వాడ జగన్నాథశాస్త్రి(అల్లు అర్జున్) బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. కేటరింగ్ బిజినెస్ చేస్తుంటాడు. చిన్నప్పటినుండి కూడా అన్యాయం చూసి తట్టుకోలేని దువ్వాడ జగన్నాథం ఓ పోలీస్ సహాయం తీసుకొని డిజె పేరుతో అన్యాయం చేసే వారిని మట్టుబెడుతుంటాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతాడు. ఓ పెళ్ళిలో జగన్నాథం, పూజ( పూజ హెగ్డే) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. పూజ కూడా జగన్నాథంను ప్రేమిస్తుంది. మరో పక్క నాయుడు కన్స్ట్రక్షన్ కంపనీ యజమనీ.. ప్రజలను మోసం చేసి తొమ్మిదివేల కోట్లను తన అకౌంట్ లో వేసుకోవాలనుకుంటాడు. మరి ఆ విషయం డిజెకు తెలుస్తుందా..? రొయ్యలనాయుడుని డిజె ఎలా కనిపెడతాడు..? జగన్నాథం, పూజల ప్రేమకథ చివరకు ఏ మలుపు తీసుకుంటుంది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
అల్లు అర్జున్
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్:
కథ
ఎడిటింగ్
హెవీ కాస్టింగ్

విశ్లేషణ:
పక్కా కమర్షియల్ సినిమా కూడా కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తుంటాడు అల్లు అర్జున్. కథ తనకు సంతృప్తిగా అనిపిస్తే తప్ప సెట్స్ పైకి వెళ్ళడు. అలాంటిది దువ్వాడ జగన్నాథంలో ఏ పాయింట్ నచ్చి సినిమా అంగీకరించాడో.. అర్ధంకాని పరిస్థితి. రెగ్యులర్ రొటీన్ కథతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. అక్కడ హీరో అల్లు అర్జున్ కావడంతో హరీష్ ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అయ్యాయి.

అల్లు అర్జున్ సినిమా మొత్తాన్ని తన భుజంపై వేసుకొని నడిపించాడు. బ్రాహ్మణ పాత్ర కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఆ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతూ.. అందరినీ అలరించాడు. ఇక డిజె లాంటి క్యారెక్టర్ బన్నీకు చాలా సింపుల్ కాబట్టి ఆ పాత్రలో అవలీలగా నటించేశాడు. పూజా హెగ్డే కేవలం స్కిన్ షోకి మాత్రమే పరిమితమైంది. తెరపై ఆమెను చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. రావు రమేష్ రొయ్యలనాయుడు పాత్ర అతడి తండ్రి రావు రమేష్ ను తలపిస్తుంది. మురళీశర్మ, తనికెళ్ళభరణి, పోసాని కృష్ణమురలి తమ పాత్రల పరిధుల్లో మెప్పించారు.

సినిమా మొదటి భాగం ఉన్నంత ఎంటర్టైనింగ్ గా రెండో భాగం లేదు. క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అంత ఆకట్టుకునే విధంగా లేవు. టెక్నికల్ గా సినిమా విలువలు భారీగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. అబు దాబి లొకేషన్స్ అందంగా చూపించారు. దేవిశ్రీప్రసాద్ పాటలు వినడానికి బాగున్నాయి కానీ ఏ పాట కూడా సంధర్భానుసారంగా లేదు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సిఉంది. మొత్తానికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాను ఎంటర్టైన్మెంట్ వే లో చెప్పడానికి చేసిన ప్రయత్నం కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది.
రేటింగ్: 2.75/5