HomeTelugu Trendingబాలయ్యతో బ్రహ్మానందం సందడి.. ప్రోమో

బాలయ్యతో బ్రహ్మానందం సందడి.. ప్రోమో

Unstoppable Ep 3 Promo
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో‘అన్‌స్టాపబుల్‌’. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రహ్మానందం సరదగా సంభాషించారు. మరో అతిథిగా దర్శకుడు అనిల్‌ రావిపూడి విచ్చేశారు. ‘బాలకృష్ణగారు కామెడీ చేస్తారు. అయినా ఆయన కమెడియన్‌ కాదు సింహం’ అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. ఈ ఇద్దరితో బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు. మంచి వినోదం పంచారు. ఓ ఫొటోను చూపించి, దీన్ని దేనికి వాడతామని బాలకృష్ణ అడగ్గా.. అనిల్‌ రావిపూడి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఏయ్‌.. ఏది పడితే అది చెప్పకు’ అంటూ బ్రహ్మానందం నవ్వులు పూయించారు. తనకెంతో పేరు తీసుకొచ్చిన పాత్రను ఈ కార్యక్రమ వేదికపై అభినయించి అలరించారు. అనంతరం ఓ విషయంలో బాలకృష్ణ బ్రహ్మానందంపై కోప్పడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu