రజనీ ‘లాల్‌ సలామ్‌’ మూవీ ప్రారంభం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. ఆయన కుమారై ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం ఈ రోజు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను వదిలారు.

రజనీ క్రేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఇది. లుక్ పరంగా కూడా కొత్త రజనీని ప్రేక్షకుల ముందుంచే సినిమా ఇది. రజనీకాంత్ క్రేజ్ కీ .. ఆయన మార్కెట్ కి తగినట్టుగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను లైకా నిర్మిస్తుంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నాడు.

ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రజనీ ‘జైలర్’ ఈ సినిమాలో నటిస్తున్నాడు. పదేళ్ల క్రితం ‘3’ అనే సినిమాతో మెగాఫోన్‌ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్‌. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాలేకపోయిన ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది. ‌

ఈ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని వాయ్‌ రాజా వాయ్‌ అనే క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించింది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు కాసుల వర్షం కురిసింది. ఆ తర్వాత ఒక డాక్యుమెంటరీ ఫిలిం తెరకెక్కించింది. కాగా ఐశ్వర్య మళ్లీ దాదాపు ఆరు సంవత్సరాలు తరువాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates