HomeTelugu Big Storiesపుట్టినరోజు సందర్భంగా.. 'రాణి'ని దత్తత తీసుకున్న ఉపాసన

పుట్టినరోజు సందర్భంగా.. ‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన

Upasana adopted elephant foమెగా కోడలు, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ఈ రోజు (జులై 20)న పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మంచి పని చేసింది నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని ‘రాణి’ అనే ఏనుగును‌ ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. సోమవారం జూ పార్కును సందర్శించిన ఆమె రాణిని ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల చెక్‌ను క్యూరేటర్, ఐఎఫ్‌ఎస్‌ అధికారిని క్షితిజకు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ‌ మాట్లాడుతూ… జూపార్కులో వన్యప్రాణుల సంరక్షణ బలోపేతం చేయడంలో భాగంగా ఉపాసన కొణిదెల చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

అడవి జంతువుల పరిరక్షణలో ఉపాసన కృషి అభినందనీయమన్నారు. ఉపాసన నిబద్ధత చాలా మందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. కరోనా కాలంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువులను దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారని క్షితిజ ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు మూగ జీవాలంటే యిష్టమని.. వాటికి కావాల్సిన ఆలన పాలన చూసుకోవడం సంతృప్తినిస్తుందని తెలిపింది ఉపాసన. మరోవైపు సోషల్ మీడియాలో ఉపాసనకు బర్త్ డే విషెస్ చెప్తూ వేలాది మంది అభిమానులు పోస్టులు పెట్టారు.

Upasana adopted elephan

Recent Articles English

Gallery

Recent Articles Telugu