HomeTelugu Trendingఉపాసన చేతుల మీదుగా 'నాట్యం' ఫస్ట్‌లుక్‌

ఉపాసన చేతుల మీదుగా ‘నాట్యం’ ఫస్ట్‌లుక్‌

Upasana released Natyam F
మెగా కోడలు, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న తన స్నేహితురాలు, డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా నాట్యం ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వనున్న త‌న‌ స్నేహితురాలు సంధ్యా రాజును ప్రేక్ష‌కులకు పరిచయం చేస్తున్నాన‌ని చెప్పింది. ఈ సినిమా టైటిల్ త‌న‌కు బాగా నచ్చిందని ఉపాసన ట్వీట్ చేశారు. ఈ లుక్‌లో సంధ్యా రాజు నాట్యం చేస్తూ క‌న‌ప‌డుతోంది. డ్యాన్స్ గురువు మరియు అతని శిష్యురాలి మధ్య ముడిపడిన ప్రత్యేకమైన ప్రేమకథను చూపించబోతున్నారు. రేవంత్ కోరుకొండ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబీ దీవానా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu