‘నాట్యం’ మూవీ టీజర్‌


ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న సినిమా ‘నాట్యం’. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు బుధవారం ఉదయం గం. 10.08 నిమిషాలకు సినిమాకు సంబంధించిన టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేసారు.

టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ తో రొమాంటిక్ గా రన్ అయింది టీజర్. ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, రుక్మిణి విజయ్ కుమార్, బేబీ దీవానా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘నాట్యం’ సినిమా నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ తరపున దిల్ రాజు విడుదల చేయనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates