HomeTelugu Trendingనిర్మాతగా మారిన సోనూసూద్‌

నిర్మాతగా మారిన సోనూసూద్‌

Sonu Sood turns as a produc

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్.. తెరపై విలన్ పాత్రలు నటిస్తున్ననప్పటికి నిజజీవితంలో మాత్రం హీరోగా నిలిచిపోయాడు. ఆపదలో వున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆచరణలో చేసి చూపించిన మానవత్వము చాటుతున్న వ్యక్తి సోనూసూద్. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ టైమ్‌లో దేశంలోని ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వలస కార్మికులను తన సొంత ఖర్చులతో వారి వారి స్వస్థలాలకు చేర్చిన వ్యక్తి.

తాజాగా ఈ నటుడు నిర్మాతగా కూడా మారుతున్నాడు. త‌న తండ్రి శ‌క్తి సాగ‌ర్ సూద్ పేరు మీద నెల‌కొల్పిన శ‌క్తిసాగ‌ర్ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. “ప్రజలలో స్ఫూర్తిని నింపే కథలతో చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాను. అలాంటి కథల కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మా సంస్థ నుంచి సినిమా వస్తుంది” అని చెప్పారు సోనూసూద్

Recent Articles English

Gallery

Recent Articles Telugu