HomeTelugu Trendingఉపాసన తాత కన్నుమూత..

ఉపాసన తాత కన్నుమూత..

2 26
మెగా కోడలు ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉపాసన ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాత కె.ఉమాపతి రావు(జూన్‌ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత‌’ అంటూ ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండకు చెందిన ఉమాపతిరావు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. టీటీడీ తొలి ఈవోగా సేవలందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu