HomeTelugu Trendingఎన్టీఆర్‌ అన్నీ సినిమాలు ఇకపై సొంత బ్యానరలోనే..

ఎన్టీఆర్‌ అన్నీ సినిమాలు ఇకపై సొంత బ్యానరలోనే..

7 21
టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే తెరకెక్కిస్తారని ఇటీవల ప్రచారమైంది.

తాజా సమాచారం ప్రకారం తారక్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం .. 30వ చిత్రం మాత్రమే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తెరకెక్కుతుంది. అటుపై 31వ సినిమా నుంచి అన్ని సినిమాలు తారక్ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనున్నాయట. అందుకోసం తారక్ సొంతంగా నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపిస్తున్నారు. ఇక పై ఎన్టీఆర్ అన్ని సినిమాలు ఈ బ్యానర్ పైనే ఉంటాయని తెలుస్తుంది. ఇక హరికృష్ణ పేరు మీద ప్రారంభించే ఈ బ్యానర్ కి ఎన్.హెచ్.కె ఆర్ట్స్ అనే షార్ట్ టైటిల్ ని ప్లాన్ చేశారు. ఇక ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ కి సంబంధించిన మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu