ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్‌తో కలిసి ‘ఏఏఏ’సినిమాస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. తాజాగా ఈ మల్టీప్లెక్స్‌కి సంబంధించి పూజా కార్యక్రమం జరగగా, దానికి బన్నీ హాజరయ్యాడు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో హైదరాబాద్ ప్రజలను అలరించేలా ఈ థియేటర్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్‌తో కలిసి ‘ఏఎంబీ’ సినిమాస్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేరకొండ కూడా ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్ లో మల్టీ ప్లెక్స్ ప్రారంభించారు