HomeTelugu Trending'పాగల్‌' హీరోతో ఉప్పెన హీరోయిన్‌!

‘పాగల్‌’ హీరోతో ఉప్పెన హీరోయిన్‌!

1 22
టాలీవుడ్‌లో ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌ సేన్‌. ఇటీవల ‘హిట్‌’తో ప్రేక్షకులను అలరించారు. ఆయన హీరోగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. కృతి ప్రస్తుతం వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వస్తోన్న ‘ఉప్పెన’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమానే ఆమెకు మొదటి సినిమా. మరోవైపు నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ’18 పేజెస్‌’ చిత్రంలోనూ నాయికగా ఎంపికైనట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu