HomeTelugu Trending'ఉప్పెన' హీరో, హీరోయిన్ ఫస్ట్‌లుక్‌

‘ఉప్పెన’ హీరో, హీరోయిన్ ఫస్ట్‌లుక్‌

15 6
టాలీవుడ్‌ మెగా హీరో .. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు.

ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘ఉప్పెన’ మూవీతో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్ గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లుక్స్ ను విడుదల చేసారు. వైష్ణవ్ తేజ్ ‘ఆసి’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. బోటులో నిలబడి ఉన్న అతని లుక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది కొంచెం సాయిధరమ్ తేజ్‌లా ఉన్నాడు. ఇక హీరోయిన్ కృతి శెట్టి ‘సంగీత’ పాత్రలో కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu