HomeTelugu Trendingఊర్వశి రౌతేలా 'వర్జిన్ భానుప్రియ' ఓటీటీలో..

ఊర్వశి రౌతేలా ‘వర్జిన్ భానుప్రియ’ ఓటీటీలో..

5
హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించిన ‘వర్జిన్ భానుప్రియ’. అజయ్‌ లోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రౌతేలా సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి (భానుప్రియ)గా నటిస్తోంది. అయితే తను చదువుకునే కళాశాల్లోనే కొంతమంది స్నేహితులు ఏర్పడతారు. అక్కడ ఈ సంప్రదాయంగా పెరిగిన అమ్మాయి అనుకోకుండా సంప్రదాయనికి విరుద్దంగా నడుచుకోవాలి అనుకుంటుంది. కానీ అది ఆమెకు సాధ్యపడదు. ఆ తరువాత ఆమె ఏం చేసింది అన్నదే కథలో అంశం. ఆద్యంతం లవ్ రొమాన్స్ థ్రిల్ నేపథ్యంలో రక్తి కట్టించే చిత్రమిది. అందుకే హిందీ వెర్షన్ కి ‘వర్జిన్ భానుప్రియ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని నిర్ణయించారు. వాస్తవానికి థియేటర్స్‌లో విడుదల చేయడం కోసమే తెరకెక్కించారు. కానీ మహమ్మారీ కారణం గా జూలై 16 న నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు తన చిత్రం గురించి ఉర్వశి మాట్లాడుతూ ‘ది కామెడీ డ్రామా. ప్రస్తుత యువత కు పూర్తిగా కనెక్టయ్యే చిత్రమిది. ఇది ఫ్యామిలీ మెచ్చే కామెడీ చిత్రం. కుటుంబం .. యువత మధ్య సంబందబాంధవ్యాల్ని అన్వేషించేదిగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలా పూర్తి యవ్వనం గా తెరపై కనిపిస్తాను’ అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!